e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News Kajal in Warangal | వ‌రంగ‌ల్‌లో కాజ‌ల్-గౌత‌మ్ కిచ్లూ సంద‌డి..స్టిల్స్ వైర‌ల్

Kajal in Warangal | వ‌రంగ‌ల్‌లో కాజ‌ల్-గౌత‌మ్ కిచ్లూ సంద‌డి..స్టిల్స్ వైర‌ల్

టాలీవుడ్ క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Agarwal ) పెళ్లి త‌ర్వాత మ‌రింత జోష్ లో క‌నిపిస్తోంది. పెళ్ల‌య్యాక కాజ‌ల్ త‌న భ‌ర్త గౌత‌మ్ కిచ్లూ (Gautam Kitchlu ) నుంచి ఎలాంటి అభ్యంత‌రం లేక‌పోవ‌డంతో సంతోషంగా త‌న ప్రొఫెష‌న‌ల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్స‌వాల‌తో బిజీ బిజీగా ఉంటోంది. తాజాగా ఈ భామ వ‌రంగ‌ల్ (Warangal) లో సంద‌డి చేసింది. ఇవాళ వ‌రంగ‌ల్ టౌన్ లో కాసం పుల్ల‌య్య షాపింగ్ మాల్ ను కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రారంభించింది.

ఎప్పుడూ సింగిల్ గా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు వెళ్లే కాజ‌ల్..ఈ సారి మాత్రం హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్ కు భ‌ర్త గౌత‌మ్ కిచ్లూను వెంట పెట్టుకొని వెళ్లింది. అంద‌మైన సిల్క్ శారీలో తెలుగు ద‌నం ఉట్టిప‌డేలా అంద‌రిని మంత్ర‌ముగ్దుల్ని చేస్తోంది కాజ‌ల్‌. షాపింగ్ మాల్ స‌మీపంలో త‌న‌ను చూడ‌టానికి వ‌చ్చిన అభిమానులకు భ‌ర్త గౌత‌మ్ కిచ్లూను ప‌రిచ‌యం చేసింది. గౌత‌మ్‌, ఫ్యాన్స్ తో క‌లిసి సెల్ఫీ దిగింది. న‌న్ను క‌లిసేందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. నేను వ‌రంగ‌ల్ వ‌చ్చిన ప్ర‌తీసారి మీ అంద‌రి నుంచి నాకు గొప్ప స్వాగ‌తం ల‌భిస్తుంది. నా సినిమాలు ఆద‌రిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

- Advertisement -

వ‌రంగ‌ల్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని చెప్పింది కాజ‌ల్‌. కాజ‌ల్‌, గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి వ‌రంగ‌ల్ లో సంద‌డి చేసిన ఫొటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కాజ‌ల్ న‌టించిన ఆచార్య విడుద‌లకు ముస్తాబ‌వుతోంది. మ‌రోవైపు హిందీలో ఉమ ప్రాజెక్టు చేస్తోంది. దీంతోపాటు అక్కినేని నాగార్జున హీరోగా న‌టిస్తున్న‌ చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement