తల్లి పాత్రలో కాజల్

పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఆలోచనాధోరణిలో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రయోగాలు, వైవిధ్యతతో కూడిన పాత్రలవైపు మొగ్గుచూపుతోంది ఈ సుందరి. తాజాగా ఓ తమిళ సినిమాలో ఆమె తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాజల్ అగర్వాల్ కథానాయికగా జె.ఎమ్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. హారర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘రౌడీబేబీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తల్లీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఇందులో కాజల్ అగర్వాల్ తల్లి పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. గ్లామర్ హంగులకు దూరంగా డీగ్లామర్ లుక్‌లో కాజల్ కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్, రమ్యకృష్ణ, రాయ్‌లక్ష్మీ కీలక పాత్రలను పోషించనున్నట్లు సమాచారం. రమేష్ పి పిైళ్లె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

