Satyabhama Teaser | దీపావళిని ముందే తీసుకువచ్చిన కాజల్ అగర్వాల్.. ‘సత్యభామ’ టీజర్ రిలీజ్
Satyabhama Teaser | భగవంత్ కేసరి సినిమాతో భారీ హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈసారి పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ' (Satyabhama)’.
Satyabhama Teaser | భగవంత్ కేసరి సినిమాతో భారీ హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈసారి పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ’ (Satyabhama)’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తుండగా.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ టిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కాజల్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
”సత్య ఈ కేసు నీ చేతుల్లో లేదు. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సర్. అంటూ కాజల్ అగర్వాల్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. ఇక టీజర్ చూస్తే హైదరాబాద్ నగరాన్ని కదిలించిన భయంకరమైన హత్య కేసును పోలీసాఫీసర్‌గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఎలా పరిష్కరించారనేది ఈ మూవీ. ఇక ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే సమ్మర్ కు ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

