నీ ముందు ఆ సవాలు చిన్నదే .. కాజల్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Kajal Aggarwal | టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బాబుకు నీల్ కిచ్లూ అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న కాజల్.. తన విలువైన సమయాన్ని కొడుకుతో గడుపుతోంది.
Kajal Aggarwal | టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బాబుకు నీల్ కిచ్లూ అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న కాజల్.. తన విలువైన సమయాన్ని కొడుకుతో గడుపుతోంది. ఈ క్రమంలో తన కొడుకు నీల్ పుట్టి ఆరునెలలు పూర్తైన సందర్భంగా కాజల్ ఓ పోస్టు పెట్టారు. కొడుకుపై శ్రద్ధ చూపడంలో ఎక్కడా రాజీపడను అంటూ ఎమోషనల్ అయ్యారు. బాబుకు సంబంధించిన ఫొటోను సైతం అభిమానులతో పంచుకున్నారు.
‘‘నువ్వు పుట్టి అప్పుడే ఆరు నెలలవుతోంది. కాలం ఎంత తొందరగా గడిచిపోయింది. ఒక యంగ్ మదర్‌గా నీ విషయంలో నేను మొదట భయపడ్డాను. ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలనా లేదా అని అనుకున్నా. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నేర్చుకుంటూనే ఉన్నా. నాకు ఎన్ని పనులు ఉన్నా.. నీ కోసం నా సమయాన్ని ఎప్పుడూ కేటాయిస్తూనే ఉంటా. నీ పై శ్రద్ధ చూపడంలో ఎక్కడా రాజీపడను. నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా.. నేను పొందే ఆనందం ముందు ఆ సవాలు చిన్నదే అనిపిస్తుంది. నువ్వు రాత్రిపూట చేసే అల్లరి నాకు సంతోషాన్నిస్తుంది. నేను, మీ నాన్న నీ గురించి సరదాగా మాట్లాడుకుంటుంటాము. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. నీకు జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు పుట్టి ఏడాది కావడానికి ఇంకా సగం దూరం ఉంది. మై లవ్.. మై బేబీ నీల్’’ అని రాసుకొచ్చారు.
దీంతోపాటు నీల్‌కు సంబంధించిన క్యూట్ ఫొటోను షేర్ చేశారు. అందులో బాబు తన నుదిటిపై చేయి వేసుకుని.. చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

