Kaikala Satyanarayana: విషమంగా కైకాల ఆరోగ్యం.. అపోలోలో చికిత్స

విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా అది కైకాల సత్యనారాయణకే చెందుతుంది. దాదాపు ఆరు దశాబ్ధాలుగా ప్రేక్షకులని అలరించిన ఆయన ఇటీవల తన ఇంట్లో జారిపడ్డారు. కింద పడడం వలన నొప్పులు కాస్త ఎక్కువగా ఉండడంతో సికింద్రాబాద్లోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించి వైద్యం అందించారు.
తాజాగా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ కోలుకోవాలని పలువురు నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’… అని చిరు తన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే.
గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

