కొత్త కోణంలో ఉపేంద్రను చూస్తారు
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’. ఈ చిత్రంలో శ్రియా సరన్, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’. ఈ చిత్రంలో శ్రియా సరన్, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్. సుధాకర్ రెడ్డి సమర్పణలో రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ సంస్థలు ఈ నెల 17న విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో ఉపేంద్ర మాట్లాడుతూ…‘విజువల్ గ్రాండియర్ మూవీ ఇది. రెండు, మూడేండ్లుగా ఈ సినిమాకు పనిచేస్తున్నాం. ఈ సినిమాను ఇంత బాగా రూపొందించిన ఘనత దర్శకుడు చంద్రూకే దక్కుతుంది. ఆయన కల ఈ సినిమా. కరోనా సమయంలోనూ ఎన్నో శ్రమలకోర్చి సినిమాను పూర్తి చేశారు. నా ఉపేంద్ర సినిమాను ప్రేక్షకులు మర్చిపోలేరు. అలాంటి చిత్రం కావాలని ఎదురుచూస్తుంటారు. త్వరలోనే యూఐ చిత్రంతో మీ ముందుకొస్తాను’ అన్నారు. నాయిక శ్రియా సరన్ మాట్లాడుతూ…‘తెలుగు సినిమా నాకెప్పుడూ ప్రత్యేకమే. నటిగా నేను ఎదిగింది ఇక్కడే. ఉపేంద్రతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆయనను కొత్త కోణంలో చూపించే చిత్రమిది’ అని చెప్పింది. నిర్మాత లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ…‘ఉపేంద్ర నటించిన ‘బుద్ధిమంతుడు’ చిత్రాన్ని తెలుగులో నేనే విడుదల చేశాను. మళ్లీ ఆయన కబ్జా చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. తెలుగులో కేజీఎఫ్, కాంతార సినిమాలు ఘన విజయాలు సాధించాయి. మా సినిమా కూడా అదే స్థాయి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

