కబ్జా నుండి ఉపేంద్ర, సుదీప్ లుక్ విడుదల

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ హవా నడుస్తుంది. స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వైవిధ్యమైన ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తాజాగా కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, కన్నడ బాద్షా కిచ్చా సుదీప్ కాంబినేషన్లో కబ్జా అనే చిత్రం రూపొందుతుంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఉపేంద్ర, చంద్రు కాంబినేషన్లో కన్నడలో ‘బ్రహ్మ’, ‘ఐ లవ్ యూ’ సినిమాలు వచ్చాయి. ‘కబ్జా’ .. ఉపేంద్ర, చంద్రు కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం.
కబ్జా చిత్రంలో భార్గవ్ భక్షి అనే పాత్రను కిచ్చా సుదీప్ పోషిస్తున్నారు. 1947-1986 కాలంలో ఈ పాత్ర ఉంటుంది. మాఫియాను అంతం చేసే ఒక పాత్ర అని తెలుస్తుండగా, సుదీప్ పాత్ర కూడా కొత్తగా ఉంటుందట. ఈ సినిమా ద్వారా 1947 కాలానికి తీసుకెళ్లబోతున్నారు. అండర్ వరల్డ్లో ఒక కొత్త కోణాన్ని చూపించబోతున్నారు.‘కె.జి.యఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఎ.జె.షెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా, గతంలో హిందీ మూవీ ‘ఓ మై గాడ్’ కన్నడ రీమేక్ ‘ముకుందా మురారి’లో సుదీప్- ఉపేంద్ర కలిసి నటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

