Kabza Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న కబ్జా ట్రైలర్.. కేజీఎఫ్‌కి మించి ఉందిగా..!
ఒకప్పుడు కన్నడ సినిమాలకు ఇతర ఇండస్ట్రీలలో అంతగా గుర్తింపు ఉండేది కాదు. కన్నడ సినిమాలను తక్కువ చేసి చూసేవారు. కానీ ఇప్పుడు కన్నడ సినిమాలే రాజ్యమేలుతున్నాయి. కేజీఎఫ్ మొదలుకుని చార్లీ, విక్రాంత్ రోణ, కాంతార ఒకదానికి మించి మరొకటి విజయాలు సాధిస్తున్నాయి.
Kabza Movie Trailer | ఒకప్పుడు కన్నడ సినిమాలకు ఇతర ఇండస్ట్రీలలో అంతగా గుర్తింపు ఉండేది కాదు. కన్నడ సినిమాలను తక్కువ చేసి చూసేవారు. కానీ ఇప్పుడు కన్నడ సినిమాలే రాజ్యమేలుతున్నాయి. కేజీఎఫ్ మొదలుకుని చార్లీ, విక్రాంత్ రోణ, కాంతార ఒకదానికి మించి మరొకటి విజయాలు సాధిస్తున్నాయి. అంతేకాకుండా ‘కేజీఎఫ్’ సినిమా తర్వాత కన్నడ సినిమాల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి. కంటెంట్ ఉన్న కథలను తెరకెక్కిస్తూ పాన్ ఇండియా స్థాయిలో హిట్లు కొడుతున్నారు. కథల పరంగానే కాదు టెక్నికల్‌గానూ కన్నడ సినిమాలు ఇతర భాషల సినిమాలను డామినేట్ చేస్తున్నాయి.
కాగా తాజాగా మరో కన్నడ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమైంది. కన్నడ స్టార్లు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘కబ్జా’. ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో పెద్దగా స్టోరీని రివీల్ చేయలేదు గాని, విజువల్స్ మాత్రం కేజీఎఫ్ రేంజ్లో ఉన్నాయి. ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్‌పై పోటా పోటిగా నటించడంతో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. మళ్లీ కేజీఎఫ్ లాంటి హై యాక్షన్ సినిమాను కన్నడ నుండి చూడబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఒక సామ్రాజ్య నిర్మాణం నరికే కత్తితో కాదు.. ఆ కత్తిని పట్టుకున్న బలమైన చేతితో సాధ్యం అనే డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. రవిబస్రూర్ నేపథ్యం సంగీతం ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది.
ఈ సినిమా కథ 1947 నుండి 1984 మధ్య జరుగుందట. అనుకోని పరిస్థితుల్లో ఓ స్వాతంత్ర సమరయోధుడి కొడుకు మాఫీయా ప్రపంచంలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అని కాన్సెప్ట్‌తో సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో శ్రియాశరణ్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఏకంగా 7 భాషల్లో విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠి, బెంగాళీ భాషల్లో విడుదల కానుంది. అంతేకాకుండా ఏడు భాషల్లో విడుదలవుతున్న మొదటి కన్నడ సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

