Tamannah Bhatia | ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన తమన్నా డ్యాన్స్ స్టెప్స్‌తో తెరకెక్కిన ‘కావాలయ్యా.. కావాలయ్యా’ అనే పాట ప్రోమోనే వైరల్‌గా మారింది. ఈ పాట సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘జైలర్’ చిత్రంలోనిది.తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్‌కు సంబంధించిన పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.
‘ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తమిళ పాట వరల్డ్‌వైడ్‌గా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై టాప్ ట్రెండింగ్‌లో వుంది. అనిరుధ్ ఈ పాటకు సంగీతం అందించగా, తెలుగు వెర్షన్‌కు శ్రీ సాయికిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్ కలిసి పాడారు’ అని చిత్రబృందం తెలియజేసింది.