సుప్రసిద్ధ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ కుమార్తె దివ్యదీప్తి నిర్మాతగా కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్శంకర్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామలింగేశ్వర్ రావు క్లాప్‌నివ్వగా, ప్రముఖ నిర్మాత ఏ.యం.రత్నం కెమెరా స్విఛాన్ చేశారు. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ ‘కుటుంబ కథా చిత్రమిది. ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. ఈ నెలలోనే చిత్రీకరణ మొదలుపెడతాం’ అన్నారు. చక్కటి భావోద్వేగాలు కలబోసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ కె నల్లి, సాహిత్యం: భాస్కరభట్ల, నిర్మాతలు: కోడి దివ్యదీప్తి, నరేష్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్శంకర్.