అసలైన దీపావళి సినిమా
‘ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చుని నవ్వుకునే సినిమా ‘కె-ర్యాంప్'. మంచి సినిమా చేశామనే నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకంతోనే థియేటర్లకు రండి అని ఆడియన్స్‌ని కాన్ఫిడెంట్‌గా పిలుస్తున్నాం. ఇది అసలైన దీపావళి సినిమా. అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చింది.
‘ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చుని నవ్వుకునే సినిమా ‘కె-ర్యాంప్’. మంచి సినిమా చేశామనే నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకంతోనే థియేటర్లకు రండి అని ఆడియన్స్‌ని కాన్ఫిడెంట్‌గా పిలుస్తున్నాం. ఇది అసలైన దీపావళి సినిమా. అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చింది. నా అభిమానులు గర్వపడే సినిమా ఇది. ఇక నుంచి అలాంటి సినిమాలే చేస్తా. టికెట్ బుక్ చేయాలా వద్దా అనుకునేవారు కాన్ఫిడెంట్‌గా బుక్ చేసుకోండి. మీ డబ్బులు వృథా కావు. మిమ్మల్ని గ్యారెంటీగా నవ్విస్తాం.’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కె-ర్యాంప్’. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేశ్ దండా, శివ బొమ్మకు నిర్మాతలు.
నేడు (18) ఈ సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. ‘ఈ సినిమా షూటింగ్ ఓ పిక్నిక్లా జరిగింది. సెట్లో నవ్వించిన ఏ సినిమా కూడా సక్సెస్ విషయంలో గురి తప్పదు. చేతన్ భరద్వాజ్ సంగీతం, సతీశ్ ఛాయాగ్రహణం సినిమాకు హైలైట్స్. దర్శకుడు జైన్స్ నాని 47రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం కంటిన్యూస్‌గా 48గంటలు పనిచేశాడు. కిరణ్ సినిమాలన్నీ ఒకెత్తు.. ఈ సినిమా ఒకెత్తు. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇది.’ అని రాజేశ్ దండా పేర్కొన్నారు. తనకు అవకాశం ఇచ్చిన హాస్య మూవీస్‌కి దర్శకుడు జైన్స్ నాని కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

