Varun sandesh Raghavendrarao | వరుణ్ సందేశ్‌కు దర్శకేంద్రుడి అనుకోని వరం
టాలీవుడ్ యాక్టర్ వరుణ్ సందేశ్ ( Varun sandesh ) నటిస్తున్న తాజాచిత్రం ఇందు వదన. ఈ మూవీ టీజర్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ( K Raghavendrarao ) లాంఛ్ చేయనున్నారు.

బిగ్ బాస్ తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదు వరుణ్ సందేశ్ ( Varun sandesh ). బిగ్ బాస్ సీజన్ 3లో ఈయన భార్యతో కలిసి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత కూడా పెద్దగా సినిమాలేం చేయలేదు. ఇలాంటి సమయంలో చాలా రోజుల తర్వాత ఈయన నటిస్తున్న సినిమా ఇందువదన. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇందువదన సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తుంది.
ముఖ్యంగా పోస్టర్ చాలా కళాత్మకంగా ఉంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్సార్. విడుదలైన క్షణం నుంచే ఈ లుక్కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా టీజర్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ( K Raghavendrarao ) విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 4 ఉదయం 10 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్‌లో రాఘవేంద్రరావు చేతుల మీదుగా టీజర్ విడుదల కార్యక్రమం జరగనుంది. దర్శకేంద్రుడు లాంఛ్ చేస్తుండటంతో ఈ సినిమాపై కచ్చితంగా ఆసక్తి పెరుగుతుందని వరుణ్ సందేశ్ భావిస్తున్నాడు.
అంతేకాదు ఇందువదన తన సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా కోసం వరుణ్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Pooja Hegde Akkineni Akhil | అఖిల్ ను కాపాడేది పూజాహెగ్డే మాత్రమే..?
దోస్తి వీడియో సాంగ్ ఐడియా ఎవరిదో చెప్పిన రాజమౌళి
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

