Samantha | సామ్ ఈజ్ బ్యాక్.. మునపటి కంటే మరింత బలంగా..!
టాలీవుడ్ స్టార్ నటి సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ అనే ఆటోఇమ్మూనిటీ డిసీజ్ నుంచి కోలుకుంటోంది. ఇదే సందర్భంలో సమంత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం మోటివేషనల్ కోట్స్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా శుక్రవారం ఉదయం సమంత ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ అనే ఆటోఇమ్మూనిటీ డిసీజ్ నుంచి కోలుకుంటోంది. ‘యశోద’ చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న సామ్.. ఇంట్లోనే మయోసైటిస్కు చికిత్స తీసుకుంటూ కోలుకుంటోంది. తాజాగా తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటోంది. మరికొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమా షూటింగ్‌లోనూ జాయిన్ కానుంది. ఇదే సందర్భంలో సమంత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం మోటివేషనల్ కోట్స్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా శుక్రవారం ఉదయం సమంత ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.
జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘చూసేందుకు ఇది చాలా సులభంగా ఉంది. కానీ అంత ఈజీ కాదు. మీరు ట్రై చేస్తారా..?’ అంటూ పోస్టు చేసింది. అదేవిధంగా ‘నన్ను నేను మరింత స్ట్రాంగ్‌గా మార్చుకునేందుకు ఇదో అవకాశం..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘మా సామ్ తిరిగి వచ్చింది. మునపటి కంటే మరింత బలంగా..’, ‘సామ్ ఈజ్ బ్యాక్..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక సమంత నటించిన శాకుంతలం ఇటీవలే రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేసుకుంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రావాల్సిన శాకుంతలం ఏప్రిల్ 14కు వాయిదా పడింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఇటీవలే రిలీజైన ట్రైలర్ విపరీతమైన ఆసక్తి నెలకొల్పింది. ఇది కాకుండా రుస్సో బ్రదర్స్, రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో సామ్ పాల్గొంటున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- gym
- Myositis
- Samantha
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

