June Last Week Releases | గతవారం ఆసక్తి రేకెత్తించే సినిమాలేవి లేకపోవడంతో బాక్సాఫీస్ తేలిపోయింది. రెండు వారాలు ముందు వచ్చిన ఆదిపురుష్ తప్ప గతవారం సినీ ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకపోయింది. తిరుగులేని వివాదాల మధ్య ఇరుక్కున్న ఆదిపురుష్ సినిమాపై ఎన్ని ఆఫర్లు ప్రకటించిన ప్రేక్షకులు మొహం తిప్పేస్తున్నారు. దాంతో జనాల్లేక థియేటర్లు బోసిపోయాయి. ప్రస్తుతం సినీ లవర్స్ అంతా ఈ వారం కోసం తెగ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఎందుకంటే ఈ వారం స్పైతో పాటు రెండు కల్ట్ రీ-రిలీజ్ సినిమాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓటీటీ ప్రియులను కూడా ఆకట్టుకోవడానికి మంచి మంచి సినిమాలు/ వెబ్ సిరీస్‌లు ముస్తాబవుతున్నాయి. ఈ వారం జనాలను మైమరపించే సినిమాలు ఏవేవి రిలీజవుతున్నాయో ఓ లుక్కేద్ధాం.
స్పై:
టాలీవుడ్ సినీ జనాలంతా అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమా స్పై. నిఖిల్ సినిమా అవడంతో ముందు నుంచి ఈ సినిమాపై పాజిటీవ్ బజ్ ఉంది. ఇక ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొల్పాయి. గ్యారీ బీ.హెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఒపెన్ అవగా.. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
సామజవరగమన:
ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం ఆయన నటించిన సామజవరగమన కూడా కంటెంట్ తరహాలోనే తెరకెక్కినట్లు టీజర్, ట్రైలర్‌తో స్పష్టం అయింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్‌కు మూడు రోజుల ముందే ప్రిమియర్లు వేసి మేకర్స్ పెద్ద సహసమే చేశారు. అయితే చాలా మంది ఈ సినిమాకు మంచి రివ్వూలు ఇచ్చారు. హిలేరియస్‌గా ఉందని, బ్రోచేవారెవరురా తర్వాత ఆ రేంజ్లో విష్ణుకు హిట్టిస్తుందని చెబుతున్నారు.
ఈ నగరానికి ఏమైంది రీ-రిలీజ్:
ఈ వారం యూత్ కోసం మంచి ఎంటర్టైనర్ రీ-రిలీజ్ అవుతుంది. ఇప్పటికే యూత్ తమ తమ గ్యాంగ్‌తో సినిమా కోసం సిద్ధమయ్యారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఐదేళ్ల కిందట రిలీజై కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ మధ్య రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఎక్కువ అవడంతో యూత్ ఈ సినిమా రీ-రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో ఈ సినిమాను జూన్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
తొలిప్రేమ రీ-రిలీజ్:
టాలీవుడ్ టైమ్ లెస్ క్లాసికల్‌గా చెప్పుకునే తొలిప్రేమ జూన్ 30న రీ-రిలీజ్ కానుంది. పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రీ-రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్ వచ్చింది.
వీటితో పాటుగా ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ– జూన్ 29, మాయ పేటికా, లవ్ యూ రామ్ సినిమాలు జూన్ 30న విడుదలవుతున్నాయి.
ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు
ఆహా:
అర్దమైంద అరుణ్‌కుమార్ (తెలుగు సిరీస్) – జూన్ 30
అమెజాన్ ప్రైమ్:
జాక్ ర్యాన్ (సీజన్ 4) – జూన్ 30
డిస్నీ + హాట్‌స్టార్:
ది వీకెండ్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్) – జూన్ 28
ది నైట్ మేనేజర్ (సీజన్ 2) – జూన్ 30
నెట్‌ఫ్లిక్స్:
లస్ట్ స్టోరీస్ 2 (హిందీ) – జూన్ 29
సీ యూ ఇన్ 19 లైఫ్ (కొరియన్ సిరీస్) – జూన్ 29
అఫ్వా (హిందీ) – జూన్ 30
సెలబ్రిటీ (కొరియన్ సిరీస్) – జూన్ 30
జియో సినిమా:
సెర్జెంట్ (హిందీ సిరీస్) – జూన్ 30
బుక్ మై షో:
ఫాస్ట్ X – జూన్ 29