NTR | ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. సంబురాల్లో అభిమానులు
NTR In Oscar Nominations | ఈ ఏడాది టాలీవుడ్ గొప్ప చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నటన వర్ణనాతీతం. ముఖ్యంగా తారక్ నటనకు హాలీవుడ్ ప్రముఖులు సైతం జైజైలు పలికారు. కొమురం భీం పాత్రలో తారక్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. బీభత్సం, రౌద్రం, ప్రేమ, కరుణ వంటి రసాలను క్షణాల్లోనే మార్చి.. వాటిని అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల చేత ఔరా అనిపించాడు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు తారక్‌ను సింగిల్ టేక్ ఆర్టిస్టు అంటూ వర్ణించిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ పేరు ఆస్కార్ లిస్ట్‌లో చేరింది.
అమెరికాకు చెందిన ప్రముఖ మూవీ పబ్లికేషన్స్ ‘VARIETY’ వారు ఆస్కార్-2023కి గాను ఉత్తమ నటుడు కేటగిరీలో పోటీగా ఉన్న నటుల పేర్లను ప్రచురించింది. ఈ లిస్ట్‌లో తారక్ పేరు కూడా ఉంది. ఆసియా నుండి ఈ లిస్ట్‌లో ఉన్న ఎకైక నటుడు ఎన్టీఆర్ కావడం విశేషం. ఈ విషయం తెలిసిన తారక్ అభిమానులు సంతోషంతో సంబురాలు చేసుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై సంచలనం విజయం సాధించింది. టాలీవుడ్లో మొదటి సారి 100కోట్ల షేర్‌ను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఓవరల్‌గా 1200కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రాజమౌళికి వరుసగా రెండోసారి 1000 కోట్ల క్లబ్లో నిలిచిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

