Chalapathi Rao | వీడియో కాల్లో చలపతిరావును చివరి చూపు చూసిన జూ.ఎన్టీఆర్..!
ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే చలపతిరావు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే విషయాన్ని చలపతిరావు గతంలో ఎన్నో ఇంటర్వూలలో తెలిపాడు. కెరీర్ బిగెనింగ్ నుండి చలపతిరావు
Chalapathi Rao | సీనియర్ నటుడు చలపతిరావు మరణ వార్తతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా చలపతిరావు మరణ వార్తపై జూ. ఎన్టీఆర్ స్పందించాడు.
ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే చలపతిరావు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే విషయాన్ని చలపతిరావు గతంలో ఎన్నో ఇంటర్వూలలో తెలిపాడు. కెరీర్ బిగెనింగ్ నుండి చలపతిరావు నందమూరి కుటుంబానికి ఆప్తుడిగా ఉండేవాడు. బాలకృష్ణతో, తారక్‌తో చాలా సినిమాల్లో నటించాడు. అంతేకాకుండా జూ.ఎన్టీఆర్.. చలపతిరావును బాబాయి అని ఆప్యాయంగా పిలుస్తాడు. కాగా చలపతిరావు మరణ వార్త తెలియగానే.. అమెరికాలో ఉన్న తారక్.. రవిబాబుకు వీడియో కాల్ చేసి, ఆయన్ని చివరి చూపు చూశాడు. అనంతరం రవిబాబుకు ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక చలపతిరావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు రవిబాబు చెప్పాడు. తన సోదరి అమెరికా నుండి రావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అభిమానుల సందర్శనార్థం చలపతిరావు పార్థీవ దేహాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు.
.@tarak9999 Anna video call to Ravi Babu garu For #ChalapathiRao Babai garu 😥#ripchalapathiraogaruhttps://t.co/aAG67JKADV
— Vizianagaram NTR Fans 🔰🌊 (@vzmNTRfans) December 25, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

