లెనిన్ కోసం ఎన్టీఆర్
లెనిన్' చిత్రంతో మీ అందరి ఇంటివాణ్నైపోతానని ఆదివారం తిరుపతిలో జరిగిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో చిత్ర కథానాయకుడు అక్కినేని అఖిల్ ధీమా వ్యక్తం చేసిన విషయం విదితమే.
‘లెనిన్’ చిత్రంతో మీ అందరి ఇంటివాణ్నైపోతానని ఆదివారం తిరుపతిలో జరిగిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో చిత్ర కథానాయకుడు అక్కినేని అఖిల్ ధీమా వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ అఖిల్‌ను ప్రేమిస్తారని, అందరూ ఆశ్చర్యపోయే విధంగా అతని పర్ఫార్మెన్స్ ఉంటుందని అగ్ర హీరో నాగార్జున సైతం నమ్మకం వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖిల్ కథానాయకుడిగా మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం తాలూకు సర్ఫ్రైజ్ అప్డేట్ వెలువడింది. ఈ సినిమాకు అగ్ర హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారని మేకర్స్ తెలిపారు.
సినిమా కథా నేపథ్యాన్ని, కథ జరిగే శ్రీరామపురం గ్రామ వివరాలను ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్‌తో ప్రేక్షకులకు పరిచయం చేస్తారని చిత్రబృందం వెల్లడించింది. ఎన్టీఆర్‌కు నాగార్జునతో, అక్కినేని కుటుంబంతో గాఢమైన అనుబంధం ఉందని.. అందుకే అఖిల్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ సందర్భంగా డబ్బింగ్ థియేటర్లో ఎన్టీఆర్, అఖిల్ కలిసి ఉన్న ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాయలసీమ గ్రామీణ నేపథ్య కథతో సామాజికాంశాలను చర్చిస్తూ ప్రేమకథగా ‘లెనిన్’ చిత్రాన్ని తెరకెక్కించారు. భాగ్యశ్రీ బోర్సే, సునీల్, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్, రచన-దర్శకత్వం: మురళీకిషోర్ అబ్బూరు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

