Devara | ఫుల్ యాక్షన్ మూడ్‌లో తారక్.. దేవర నెక్ట్స్ షెడ్యూల్ వివరాలివే
Devara | కొరటాల శివ (Siva Koratala)-జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో వస్తున్న చిత్రం దేవర. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక న్యూస్‌తో అభిమానులను ఖుషీ చేస్తూ వారిలో జోష్ నింపుతోంది దేవర టీం. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట బయటకు వచ్చింది.
Devara | టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ కాంబోలో ఒకటి కొరటాల శివ (Siva Koratala)-జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). జనతా గారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అంటోంది. దేవర (Devara) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్ 30 (NTR 30)గా వస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ తెలుగు ప్రేక్షకులను పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక న్యూస్‌తో అభిమానులను ఖుషీ చేస్తూ వారిలో జోష్ నింపుతోంది దేవర టీం. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
దేవర ఐదో షెడ్యూల్ శనివారంతో పూర్తయినట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. తాజాగా నెక్ట్స్ షెడ్యూల్‌కు సంబంధించిన వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం దేవర కొత్త షెడ్యూల్ జులై 18 నుంచి షురూ కానుంది. శంషాబాద్‌లో వేసిన సెట్స్‌లో సోలోమన్ పర్యవేక్షణలో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయనుంది కొరటాల టీం. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీలో ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే ఓ న్యూస్ తెరపైకి వచ్చింది.
దేవర ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగాఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పాపులర్ టెక్నీషియన్ రత్నవేల్ పనిచేస్తున్నారు. జనతాగ్యారేజ్ తర్వాత వస్తున్న రెండో సినిమా కావడంతో దేవరపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
#Devara 5th shedule has completed yesterday 👍
And the next shedule will start from this 18th a action sequence will be filmed in this shedule under Solmon master choreography in the sets of shamshabad ❤️🔥🔥#ManofMassesNTR #Devara pic.twitter.com/Eexf2yU7w2
— Devara (@Devara_ntr) July 16, 2023
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

