Devara | దేవరగా తారక్ లుక్ అదిరిందంతే.. స్టన్నింగ్‌గా టైటిల్, ఫస్ట్ లుక్
Devara | కొరటాల శివ (Siva Koratala)-జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబో సినిమా ఎన్టీఆర్ 30 (NTR 30). అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఎన్టీఆర్ 30కి దేవర (Devara) టైటిల్ ఫైనల్ చేశారు.
Devara | టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి కొరటాల శివ (Siva Koratala)-జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబో సినిమా ఎన్టీఆర్ 30 (NTR 30) . జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది.ఎన్టీఆర్ 30కి దేవర (Devara) టైటిల్ ఫైనల్ చేశారు. టైటిల్‌తోపాటు దేవర ఫస్ట్ లుక్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో ఉన్న తారక్ చేతిలో ప్రత్యేక ఆయుధాన్ని పట్టుకుని.. హార్బర్లో రౌడీలను చెండాడుతూ కనిపిస్తూ గూస్బంప్స్ తెప్పిస్తున్నాడు.
అతని కంటే భయపెట్టేది.. అతని కథ.. అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇప్పటికే స్టన్నింగ్ అప్డేట్ అందించింది. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే కథాంశంతో రాబోతున్న దేవరలో గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలుండబోతున్నాయని తాజా లుక్‌తో కన్ఫామ్ చేశాడు కొరటాల శివ. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ 30ని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జనతాగ్యారేజ్ తర్వాత వస్తున్న రెండో సినిమా కావడంతో ఎన్టీఆర్ 30పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

