విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’. అనుప్రసాద్ దర్శకుడు. నిరీష్ తిరువిధుల నిర్మాత. శనివారం ట్రైలర్ను నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, బెక్కెం వేణుగోపాల్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి యువతరం మెచ్చే కథాంశమిది.
ఆహ్లాదభరితమైన ప్రేమకథగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి’ అన్నారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులందరికి నచ్చే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. సాయికుమార్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్, దర్శకత్వం: అనుప్రసాద్.