విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’. అనుప్రసాద్ దర్శకుడు. నిరీష్ తిరువిధుల నిర్మాత. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నిర్మాత మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అన్నారు. సాయికుమార్, రోహిణి, మధునందన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్, దర్శకత్వం: అనుప్రసాద్.