‘బేబీ’లో ఉన్నింటి అబ్బాయిని. ఇందులో మిడిల్క్లాస్ అబ్బాయిని. చేనేత కుటుంబానికి చెందిన యువకుడి పాత్ర నాది. బాధల్ని మనసులోనే దాచేసి బయటికి మాత్రం సంతోషంగా కనిపిస్తుంటా. భావోద్వేగాలతో కూడిన బరువైన పాత్ర అనమాట.’ అని విరాజ్ అశ్విన్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ కథానాయిక. అనుప్రసాద్ దర్శకుడు. నిరీష్ తిరువిధుల నిర్మాత. ఈ నెల 15న విడుదల కానుంది.
ఈ సందర్భంగా విరాజ్ విలేకరులతో మాట్లాడారు. ‘ఇందులో తండ్రీకొడుకుల ఎమోషన్ కట్టిపడేస్తుంది. కొడుకుని గొప్ప వాడ్ని చేయడానికి తండ్రి ఏంచేశాడు? కుటుంబంకోసం కొడుకేం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. మన జీవితాల్లో బిగ్గెస్ట్ ఎమోషన్ ఫాదర్ ఎమోషన్. కాకతాళీయంగా రీసెంట్గా విడుదలైన హాయ్ నాన్న, యానిమల్ చిత్రాలు ఫాదర్ ఎమోషన్తోనే రూపొందాయి. రానున్న జోరుగా హుషారుగా, సైంధవ్ కూడా ఫాదర్ ఎమోషనే. కచ్చితంగా విజయం సాధిస్తాయని నా నమ్మం’ అని అన్నారు విరాజ్. హీరోగా వైవిధ్యమైన, గుర్తుంచుకోదగ్గ పాత్రలు చేయాలనేది నా కోరిక అని విరాజ్ చెప్పారు.