‘జోరుగా హుషారుగా’ చిత్రం నుంచి యువరాణి యువరాణి లిరికల్ వీడియో విడుదల
ఓ కలలా...నువ్వలా.. నిజమయ్యావే నువ్వు బంగారు బొమ్మ యువరాణి యువరాణి అంటూ కొనసాగే ఈ పాటను సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించగా, రఘు మాస్టర్ కొరియోగ్రఫీలో విరాజ్ అశ్విన్...
బేబి చిత్రంతో కథానాయకుడిగా ప్రేక్షకుల హౄదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాందించుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ కథానాయిక. అను ప్రసాద్ దర్శకుడు. శిఖర అండ్ అక్షర ఆర్స్్ట ఎల్ఎల్పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి శనివారం ఓ లవ్మెలోడీ లిరికల్ వీడియోను హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు.
ఓ కలలా…నువ్వలా.. నిజమయ్యావే నువ్వు బంగారు బొమ్మ యువరాణి యువరాణి అంటూ కొనసాగే ఈ పాటను సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించగా, రఘు మాస్టర్ కొరియోగ్రఫీలో విరాజ్ అశ్విన్, పూజితలపై చిత్రీకరించారు. ఆర్మన్ మాలిక్, నవ్యసమీర ఈ పాటను ఆలపించారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ ఈ చిత్రం సాంగ్ చూస్తుంటే ఇదొక జెన్యూన్ లవ్ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. సాంగ్ చాలా బాగుంది.
సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ఈ సాంగ్ చాలా క్యాచీగా వుంది. కొత్తదనంతో కూడిన కథతో ఓ లవ్ఎంటర్టైనర్లా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తప్పకుండా ఈ చిత్రం నా కెరీర్‌కు మరో మంచి సక్సెస్ఫుల్ చిత్రమవుతుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువతరం నచ్చే అంశాలతో అన్ని ఎమోషన్స్‌తో రూపొందుతన్న ఈ చిత్రం కొత్తదనం ఆశించే అందరికి నచ్చుతుంది.
త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు. కొత్తదనంతో నిండిన చిత్రాలకు విడుదల విషయంలో నా సపోర్ట్ ఎల్లప్పూడు వుంటుందని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. ఈ సమావేశంలో దర్శకుడు అను ప్రసాద్, కెమెరామెన్ మహిరెడ్డి పందుగుల తదితరులు పాల్గోన్నారు. విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సాయికుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మజీ , చమ్మక్ చంద్ర, క్రేజీ కన్నా తదితరులు నటిస్తున్న చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్, ఎడిటర్: మర్తండ్‌కెవెంకటేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: తేజ తిరువిధుల
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

