Joker 2 Movie | ఇకపై అతను ఒంటరి వాడు కాదు.. హాలీవుడ్ మూవీ ‘జోకర్’ టీజర్ రిలీజ్
Joker 2 Movie | హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జోకర్ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. ‘జోకర్: ఫోలీ ఏ డీక్స్’ (Joker: Folie à Deux) అంటూ ఈ సినిమా రానుండగా.. టాడ్ ఫిలిప్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది.
Joker 2 Movie | హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జోకర్ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. ‘జోకర్: ఫోలీ ఏ డీక్స్’ (Joker: Folie à Deux) అంటూ ఈ సినిమా రానుండగా.. టాడ్ ఫిలిప్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. జోక్విన్ ఫీనిక్స్‌తో పాటు పాప్‌స్టార్ లేడీగాగా కనిపించి అలరించారు. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇక ఈ టీజర్ గమనిస్తే.. జైల్లో ఉన్న జోకర్‌కి లేడిగాగా పరిచయం అవుతుంది. వీళ్ల పరిచయం ప్రేమగా ఎలా మారింది. ఆ తర్వాత ఏం జరిగింది అనే స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ సంగీత నేపథ్యంలో రానున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం అక్టోబరు4, 2024న థియేటర్లలోకి రానుంది.
2021లో వచ్చిన జోకర్ (Joker) సినిమా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డీసీ కామిక్స్‌లో భాగంగా మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమాలో నటనకు గాను జోక్విన్ ఫీనిక్స్ (Joaquin Phoenix) ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు ఇదే సినిమాకు ‘జోకర్: ఫోలీ ఏ డీక్స్’ (Joker: Folie à Deux) పేరిట సీక్వెల్ వస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

