హాలీవుడ్ నటుడు జిమ్ క్యారీ నటనకు గుడ్ బై చెప్పారు. ఇకపై నటించను అని ప్రకటించారు. జిమ్ రిటైర్మెంట్ ప్రకటన సినీ రంగాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. జిమ్ క్యారీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. స్లాప్స్టిక్ (హావభావాలతో నవ్వించడం) కామెడీకి కేరాఫ్ అడ్రస్ లాంటి నటుడాయన. తాజాగా జిమ్ మాట్లాడుతూ…‘నటించింది చాలు అనిపిస్తున్నది. ఇక విశ్రాంతి తీసుకోవచ్చని భావిస్తున్నా. నా రిటైర్మెంట్ అభిమానులను బాధిస్తుందని తెలుసు. వ్యక్తిగత జీవితం, కుటుంబం, ఆధ్యాత్మిక ఆలోచనలతో ఇకపై జీవితాన్ని గడిపేస్తా’ అని చెప్పారు.