శ్రీకమల్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జిలేబి’. కె. విజయ్‌భాస్కర్ దర్శకుడు. ఎస్ఆర్కే పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం సీనియర్ హీరో వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ‘కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిది. మణిశర్మ చక్కటి పాటలిచ్చారు. ఈ సినిమా ద్వారా నా కుమారుడు శ్రీకమల్ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిదని హీరో శ్రీకమల్ పేర్కొన్నారు. వినోదంతో పాటు ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా అందరిని మెప్పిస్తుందని శివాని రాజశేఖర్ తెలిపింది. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: మణిశర్మ.