Jigarthanda-2 | జిగర్తండ-2 టీజర్ డేట్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే?
Jigarthanda-2 Movie | 'గేమ్ చేంజర్' స్టోరీ రైటర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న 'జిగర్తండ' సీక్వెల్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా దీపావళి పండగను లాక్ చేసుకుంది.
Jigarthanda-2 Movie | ‘గేమ్ చేంజర్’ స్టోరీ రైటర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ‘జిగర్తండ’ సీక్వెల్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా దీపావళి పండగను లాక్ చేసుకుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని అందరూ అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను ప్రకటించింది.
ఈ సినిమాకు టీజర్‌ను సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఇది టీజర్‌కు మించి ఉంటుదని ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఓ వైపు లారెన్స్ ఏనుగుపై కూర్చుని తుపాకీ పట్టుకుంటే.. మరోవైపు సూర్య కెమెరాను పట్టుకున్నాడు. పోస్టర్‌తోనే సినిమాపై మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు జిగర్తండ డబుల్ ఎక్స్ అనే పేరుతో తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈ సినిమా తొలిపార్టు ‘జిగర్తండ’.. 2014లో రిలీజై తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే సినిమాతో తెలుగులో ‘చిక్కడు దొరకడు’ టైటిల్‌తో డబ్ చేయగా.. ఇక్కడ పెద్దగా ఆడలేదు. అయితే 2019లో ఈ సినిమా కథను కాస్త అటు ఇటు తప్పి హరీష్ శంకర్, వరుణ్ తేజ్‌తో ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ చేశాడు. ఈ సినిమా వరుణ్‌కు మాస్లో మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక హిందీలోనూ ఈ సినిమాను అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’గా రీమేక్ చేశాడు. కానీ అక్కడ డిజాస్టర్‌గా మిగిలింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

