Jigarthanda DoubleX | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj). ఈ క్రేజీ డైరెక్టర్ నుంచి 2014లో యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం జిగర్తండ. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ప్రాజెక్ట్ జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX). గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. ఈ మూవీలో రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్‌ను (Jigarthanda 2 teaser) కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. లారెన్స్ టీం తాజాగా షూటింగ్‌కు సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. సెట్స్‌లో ఎస్‌జేసూర్య, కార్తీక్ సుబ్బరాజు అండ్ టీం షూటింగ్ ప్యాకప్ చెబుతూ..కేక్ కట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టీజర్లో రాఘవా లారెన్స్ సర్ప్రైజ్ మాస్ లుక్‌లో, ఎస్జే సూర్య సూట్లో క్లాసీ లుక్‌లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తూ మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు.
పక్కా ఎంటర్టైనింగ్ మాస్ ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతుందని టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.
సెట్స్‌లో ఎస్‌జేసూర్య, కార్తీక్ సుబ్బరాజు టీం..
It’s a WRAP for #JigarthandaDoubleX – see you in theatres this Diwali! #J2XShootWraps #DoubleXDiwali @offl_Lawrence @iam_SJSuryah @dop_tirru @Music_Santhosh@kaarthekeyens @stonebenchers @5starcreationss @alankar_pandian @onlynikil @thinkmusicindia pic.twitter.com/6LXUITIAJ1
— karthik subbaraj (@karthiksubbaraj) July 3, 2023
జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్…