బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ‘సూపర్ హీరోస్ vs సూపర్ విలన్స్’ పోటీలో తమ జట్టును గెలిపించుకునేందుకు హౌస్మేట్స్ అందరూ బాగా కష్టపడ్డారు. శుక్రవారం ఎపిసోడ్లో బిగ్ బాస్ రెండు టీంలతో గేమ్ ఆడించాడు. ప్లాట్‌ఫాంపై ఉన్న వాళ్లని మెత్తని కర్రతో పడేయాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన వారికి ఒక పాయింట్ వస్తుందని బిగ్ బాస్ చెప్పారు.
హీరో టీం తరపున ఆడిన మానస్..విలన్ టీం వాళ్లందరిని కింద పడేసి తమ టీంకి పాయింట్స్ తెచ్చి పెట్టాడు. అనంతరం ‘మెరుపుశక్తి’ని దక్కించుకుని సూపర్ విలన్స్ జట్టు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచింది. దీంతో విలన్స్ జట్టు సంబరాల్లో మునిగి తేలింది. గెలిచిన జెస్సీకి ప్రియంక వెనక నుండి హగ్ ఇవ్వగా, జెస్సీ ఆమె బుగ్గపై ముద్దు పెట్టేశాడు. సడెన్‌గా జెస్సీ ఇలా ముద్దు పెట్టేసరికి ప్రియాంక షాక్‌లో ఉండిపోయింది.
ముద్దు పెట్టావా అని ప్రియాంకని సన్నీ అడగగా, ఛీ నేను ఎందుకు పెడతాను.. వాడే పెట్టాడు.. కంగ్రాట్స్ అని కిందికి వంగాను.. ఫటక్ అని ముద్దు పెట్టేశాడు’ అని చెప్పి చెత సిగ్గుపడిపోయింది ప్రియాంక. అయితే జెస్సీ ముద్దు పెట్టడాన్ని ప్రియాంక బాగా ఎంజాయ్ చేసినట్టుగానే కనిపించింది తప్ప బాధపడినట్టు కనిపించలేదు. ఆమె ఇచ్చిన చనువు వల్లనే జెస్సీ అలా చేశాడని అంటున్నారు.