‘రోడ్‌షో’లో.. ముగ్గురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు

బాలీవుడ్ అగ్రనాయికలు ప్రియాంకచోప్రా, అలియాభట్, కత్రినాకైఫ్ ఒకే సినిమాలో కలిసి సందడి చేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఫరాన్అక్తర్ రూపొందించబోతున్న ‘జీలే జరా’ చిత్రంలో ఈ నాయికాత్రయం నటించనున్నారు. ఫరాన్అక్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ చాహ్తా హై’ చిత్రం రోడ్‌జర్నీ నేపథ్యంలో ముగ్గురు మిత్రుల మధ్య అనుబంధానికి దృశ్యరూపంలా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై ఇరవైఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి రోడ్‌ట్రిప్ కథాంశంతో ‘జీల్జరా’చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఫరాన్అక్తర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్‌పెట్టారు. ‘రోడ్ ట్రిప్ గురించి ఎవరైనా మీతో చెప్పారా?. నా దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ముగ్గురు అగ్రహీరోయిన్లు భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభిస్తాం. రోడ్‌షోను వీక్షించాలని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఫరాన్అక్తర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. రెండేళ్ల విరామం తర్వాత ప్రియాంకచోప్రా బాలీవుడ్ సినిమాలో నటించబోవడం విశేషం. ఈ సినిమాలో అందరూ మహిళా తారాగణం నటిస్తారని ప్రియాంక తెలిపింది. ఫరాన్అక్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్చాహ్తాహై’ ‘జిందగీ న మిలేగా దోబారా’ చిత్రాలు కూడా రోడ్‌జర్నీ నేపథ్య కథలతో తెరకెక్కడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

