20 ఏళ్ళ తర్వాత రీమేక్ అవుతున్న నితిన్ ‘జయం’.. హీరో ఎవరంటే..?

కొన్ని కథలు బోర్ కొట్టవు.. అవి ఎప్పుడు వచ్చినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అలాంటి కొన్ని అరుదైన కథల్లో జయం సినిమా కూడా ఉంటుంది. తేజ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నితిన్ లాంటి హీరోను తెలుగు ఇండస్ట్రీకి అందించింది జయం. అలాగే గోపీచంద్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. జయం కంటే ముందే 2000లో తొలి వలపు సినిమా చేసాడు గోపీచంద్. కానీ అది డిజాస్టర్ కావడంతో రెండేళ్ళ గ్యాప్ తీసుకుని జయం సినిమాలో విలన్ గా పరిచయం అయ్యాడు. 2002లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది.
నితిన్ కెరీర్‌కు కావాల్సిన పునాది అప్పుడే గట్టిగా వేసింది జయం. తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన జయం అప్పట్లోనే 13 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఈ సినిమాను తమిళంలో అదే పేరుతో రీమేక్ చేసారు. అక్కడ కూడా విలన్ గా గోపీచంద్ నటించాడు. ఈ సినిమాతోనే ఎడిటర్ మోహన్ తనయుడు రవి హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో జయం రవి అయిపోయాడు. ఎన్ని భాషల్లో రీమేక్ చేసినా కూడా అన్ని చోట్లా జయం విజయదుందుభి మోగించింది. ఇప్పుడు విడుదలైన 19 ఏళ్ళ తర్వాత.. ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయబోతున్నారు.
అక్కడ ఈ సినిమా రీమేక్ లో ప్రవీణ్ కుమార్ అనే డాక్టర్ నటించబోతున్నాడు. కొత్త హీరోకు జయం లాంటి కథ దొరకడం అరుదైన విషయం. ఇన్నేళ్ళ తర్వాత కూడా జయం కథనే ఈయన కూడా ఎంచుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు మరో సినిమా కూడా చేయబోతున్నారు ప్రవీణ్ కుమార్. యశ్ లాంటి సూపర్ స్టార్ ను కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు శశాంక్.. ప్రవీణ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత జయం రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఏదేమైనా కూడా 20 ఏళ్ళ తర్వాత జయం కథను కన్నడ ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

