Sivakarthikeyan | సుధా కొంగర ‘పురాణనూరు’లో అమరన్ హీరో
‘అమరన్'తో భారీ విజయాన్ని అందుకున్నారు తమిళహీరో శివకార్తికేయన్. ఇప్పటికే ఈ సినిమా మూడొందల కోట్ల మార్కును దాటి విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. ఈ సినిమాతో శివకార్తికేయన్ క్రేజ్ కూడా పానిండియా స్థాయికి చేరిందని చెప్పొచ్చు.
Sivakarthikeyan | ‘అమరన్’తో భారీ విజయాన్ని అందుకున్నారు తమిళహీరో శివకార్తికేయన్. ఇప్పటికే ఈ సినిమా మూడొందల కోట్ల మార్కును దాటి విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. ఈ సినిమాతో శివకార్తికేయన్ క్రేజ్ కూడా పానిండియా స్థాయికి చేరిందని చెప్పొచ్చు. దీంతో శివకార్తికేయన్ నెక్ట్స్ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొన్నది. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో కమర్షియల్ సక్సెస్‌ని అందుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ నెక్ట్స్ సినిమా చేయనున్నారు.
‘పురాణనూరు’ అనే ఓ సోషియో పొలిటికల్ థ్రిల్లర్ కథను ఈ సినిమాకోసం ఆమె సిద్ధం చేశారు. శ్రీలీల కథానాయికగా ఎంపికయ్యారు. ఇదిలావుంటే.. కథ రిత్యా ఇందులో రెండు కీలక పాత్రలున్నాయట. అందులో ఒకటి విలన్ తరహా పాత్ర అట. హీరోలు చేస్తేనే వాటికి న్యాయం జరుగుతుందట. అందుకే.. విలన్ తరహా పాత్ర కోసం విశాల్‌ని కలిశారట సుధ కొంగర. అయితే.. ఆమె ప్రతిపాదనను విశాల్ సున్నితంగా తిరస్కరించారట. ఈ క్రమంలోనే ‘జయం’రవిని కూడా ఆమె కలిశారట. ఆయన ఓకే చెప్పారనేది చెన్నై టాక్. అయితే.. జయం రవి ఒప్పుకున్నది విశాల్ చేయనన్న పాత్రనా? లేక మరో పాత్రనా? అనేది తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

