సత్య మేరుగు, దీపిక జంటగా రూపొందుతున్న చిత్రం ‘జయం’. జి.కిరణ్కుమార్ దర్శకుడు. కంటూరు రవికుమార్ చౌదరి నిర్మాత. ఆదివారం పోస్టర్ లాంచ్ చేశారు. టి. ప్రసన్నకుమార్, పీపుల్ మీడియా శ్రీధర్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిథులుగా పాల్గొన్నారు.
కథ విన్నప్పుడు అప్పటి ‘జయం’ మాదిరిగానే ఈ ‘జయం’ కూడా విజయం సాధిస్తుంది అనిపించిందని, అనుకున్న దానికంటే అద్భుతంగా సినిమా వస్తున్నదని నిర్మాత తెలిపారు. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశాడు.