Jaya Bchchan | పొదల మాటున శానిటరీ ప్యాడ్లు మార్చుకునేవాళ్లం.. అవుట్డోర్ షూటింగ్ కష్టాలు గుర్తుచేసుకున్న జయాబచ్చన్
మనవరాలి పోడ్కాస్ట్ ఎపిసోడ్లో షాకింగ్ విషయాలు పంచుకున్న జయాబచ్చన్
రాజ్యసభ ఎంపీ, ఒకప్పటి నటి జయాబచ్చన్ ఏదైనా విషయం మీద తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్తారు. ఈమధ్యే తన మనవరాలు నవ్య నవేలి నందాస్ పోడ్కాస్ట్ ఎపిసోడ్‌కి జయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. ‘అవుట్డోర్ షూటింగ్ వెళ్లినప్పుడు పొదల మాటున శానిటరీ ప్యాడ్లు మార్చుకునేవాళ్లమని, అప్పట్లో టాయిలెట్లు సరిపోను ఉండేవి కావు’ అని తాను సినిమాల్లోకి వచ్చిన మొదటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు.
జయ మాట్లాడుతూ.. ‘అప్పట్లో నటీనటుల కోసం కారవాన్ లాంటి వ్యానిటీ వ్యాన్స్ ఉండేవి కావు. దాంతో, నెలసరి టైంలో అవుట్డోర్ షూటింగ్‌కు వెళ్లినప్పుడు పొదల మాటున శానిటరీ ప్యాడ్లు మార్చుకునేవాళ్లం. వాటిని ఒక ప్లాస్టిక్ బ్యాగులో వేసుకొని, ఇంటికి వచ్చాక చెత్తడబ్బాలో పడేసేవాళ్లం. దాంతో, అవుట్డోర్ షూటింగ్‌కి వెళ్లినప్పుడల్లా చాలా ఇబ్బందిగా అనిపించేది’ అని జయాబచ్చన్ షాకింగ్ విషయాలు చెప్పారు. ఉద్యోగం చేసే మహిళలకు రెండు మూడు రోజులు నెలసరి సెలవులు ఇవ్వాలని, మగవాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
15 ఏళ్లకే సినిమాల్లోకి
పదిహేనేళ్ల వయసులోనే సత్యజిత్‌రే తీసిన మహానగర్తో సినిమాల్లోకి జయ అడుగుపెట్టారు. బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించారు. బిగ్‌బీ అమితాబ్‌తో కొన్ని సినిమాలు కూడా చేశారు. ఆయనను జయ 1973లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2004 నుంచి ఇప్పటివరకూ జయ ఎంపీగా కొనసాగుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

