Jaya prada | అన్న అస్థికలను గోదావరిలో కలిపిన జయప్రద
Jaya Prada | టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jaya Prada) అన్నయ్య రాజ బాబు (Raja Babu) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే.
Jaya Prada | టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jaya Prada) అన్నయ్య రాజ బాబు (Raja Babu) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నివాసంలో ఫిబ్రవరి 27న మధ్యాహ్నం రాజ బాబు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా ఇన్‌స్టా వేదికగా తెలిపారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు జయప్రద కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
అయితే రాజమండ్రిలోని పుష్కర్‌ఘాట్ వద్ద ఉన్న గోదావరి జలల్లో నేడు రాజబాబు అస్థికలను కలిపారు కుటుంబ సభ్యులు. రాజబాబు కొడుకు సామ్రాట్‌తో కలిసి రాజమండ్రికి వచ్చిన జయప్రద దగ్గరుండి రాజబాబు అస్థికల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించింది.
అనంతరం జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి పుణ్యభూమిలో నా అన్నయ్య రాజబాబు అస్థికలు కలిపాము. రాజబాబు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. నేను రాజమండ్రికి ఎప్పుడొచ్చినా రాజబాబు తోడుగా వచ్చేవాడు. మొట్టమొదటి సారి అతడు లేకుండా రాజమండ్రి వచ్చాను. ఫిబ్రవరి 27న ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోయినందుకు మాకు చాలా దుఃఖంగా ఉంది. రాజబాబు కుమారుడైన సామ్రాట్‌ని తీసుకువచ్చి ఆయన ఎక్కడ పుట్టాడో అక్కడే అస్థికలు కలపడం జరిగింది. రాజబాబు చనిపోయి నేటికి ఏడవ రోజు. రాజమండ్రి ప్రజలు, ఈ గోదారమ్మ తల్లి, ఆ శివుడు మా తమ్ముడికి మోక్షం కలిగించాలని ప్రార్థిస్తున్నాను అంటూ జయప్రద చెప్పుకోచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

