Jawan Movie | జవాన్ వీర విధ్వంసం ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది. పైగా నార్త్‌లో చెప్పుకోదగ్గ రేంజ్లో సినిమాలేవి లేకపోవడంతో షారుఖ్ దండయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. ఇప్పటికే రూ.1100 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక నెట్ లెక్కలు చూసుకుంటే.. రూ.600 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ ఏడాది పఠాన్‌తో వెయ్యి కోట్లు కొల్లగొట్టి.. ఇప్పుడు జవాన్‌తో పఠాన్ రికార్డులను పాతాళానికి పంపుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమవుతుందా అని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 2నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీ కట్ వెర్షన్ మరోలా ఉండబోతుందని, కత్తెర పడిన చాలా సీన్స్‌ను ఓటీటీ వెర్షన్లో యాడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందీ మీడియా టాక్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ లెంగ్త్ 3 గంటలపైమాటే అట. కాగా థియేటర్లో ఈ సినిమా 2గంటల 45 నిమిషాల నిడివితో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా షారుఖ్‌కు ఇచ్చిన ఎలివేషన్లకు నార్త్ ఆడియెన్స్ ఊగిపోయారు.
ఎప్పుడూ లేనిది సౌత్ ఇండియాలో కూడా షారుఖ్ సినిమాకు రీజినల్ భాషల్లో కోట్లుల్లో కలెక్షన్లు వస్తున్నాయి. సౌత్‌లో ఆహా ఓహా అన్న రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయలేదు కానీ.. హిందీ ఆడియెన్స్ మాత్రం షారుఖ్ యాక్షన్, అట్లీ డైరెక్షన్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇక తొలిసారి ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్న తొలి ఇండియన్ హీరోగా షారుఖ్ చరిత్ర సృష్టించాడు. ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. దీపికా గెస్ట్ అప్పియెరెన్స్ కనిపించింది. విజయ్ సేతుపతి విలన్‌గా నటించగా.. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చాడు.