Jawan Movie | జవాన్ ట్రైలర్‌కు ముహర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Jawan Movie Trailer | షారుఖ్ జవాన్‌పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా తొమ్మిది రోజుల్లో ఈ పాటికి థియేటర్లు దద్దరిల్లుతుంటాయి. పైగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న అట్లీ ఈ సినిమా తెరకెక్కించడంతో ఓ రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి.
Jawan Movie Trailer | షారుఖ్ జవాన్‌పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా తొమ్మిది రోజుల్లో ఈ పాటికి థియేటర్లు దద్దరిల్లుతుంటాయి. పైగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న అట్లీ ఈ సినిమా తెరకెక్కించడంతో ఓ రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ల పనిలో పడిపోయింది. హిందీ సహా తమిళ, తెలుగు భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. అప్పుడెప్పుడో రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి రీసెంట్గా రిలీజైన సెకండ్ సింగిల్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ వస్తున్నాయి. ఇక త్వరలోనే చెన్నైలో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత తెలుగు, హిందీలో ప్రెస్ మీట్లు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటుంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 31న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదే రోజున చెన్నైలో ఓ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి అక్కడే ట్రైలర్ రిలీజ్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనుంది. రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీఖాన్ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులన్ని కలుపుకుని భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని, విడుదలకు ముందే సినిమాకు మూడొందల కోట్లు లాభాలు వచ్చాయని బాలీవుడ్ మీడియా టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

