Jawan Movie | షారుఖ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన అట్లీ.. కొత్త సీన్స్‌తో ‘జవాన్’ ఓటీటీ రిలీజ్
Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన 13 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.907.54 కోట్లు కొల్లగొట్టి.. రూ.1000 కోట్లే టార్గెట్‌గా దూసుకుపోతుంది.
Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన 13 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.907.54 కోట్లు కొల్లగొట్టి.. రూ.1000 కోట్లే టార్గెట్‌గా దూసుకుపోతుంది. ఇక హిందీలో (వారం రోజుల్లో) రూ.327.88 కోట్లు వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. గురువారం కూడా ఈ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. కాగా ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు వంటి సినీ ప్రముఖులే కాకుండా.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే జవాన్ ఓటీటీపై ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
జవాన్ ఓటీటీ గురించి దర్శకుడు అట్లీ (Atlee) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ను పంచుకున్నాడు. జవాన్ ఓటీటీ వెర్షన్.. థియేటర్ వెర్షన్ కంటే భిన్నంగా ఉంటుందని, ఓటీటీ వెర్షన్లో ఒక సర్ప్రైజ్కూడా ప్లాన్ చేస్తున్నామని అట్లీ తెలిపాడు. అయితే ఈ సర్ప్రైజ్ ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో షారుక్ సరసన నయనతార (Nayanathara) నటించగా.. విజయ్ సేతుపతి(Vijay Sethupathy), దీపిక పదుకొణె (Deepika Padukone), ప్రియమణి (Priyamani), సునీల్ గ్రోవర్ (Suni Groover), సాన్య మల్హోత్ర (Sanya Malhotra), యోగిబాబు (Yogi babu) తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

