Jawan Movie | వామ్మో జవాన్ ఓటీటీ రన్‌టైమ్ అన్ని గంటలా.. షారుఖ్ ఫ్యాన్స్‌కు పూనకాలే..!
Jawan Movie | జవాన్ వీర విధ్వంసం ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా గణేష్ చతుర్థి వీకెండ్ జవాన్‌కు బాగా కలిసొచ్చింది. పైగా నార్త్‌లో ఈ వారం చెప్పుకోదగ్గ రేంజ్లో సినిమాలేవి రిలీజ్ కాకపోవడం జవాన్‌కు ప్లస్ అయింది.
Jawan Movie | జవాన్ వీర విధ్వంసం ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా గణేష్ చతుర్థి వీకెండ్ జవాన్‌కు బాగా కలిసొచ్చింది. పైగా నార్త్‌లో ఈ వారం చెప్పుకోదగ్గ రేంజ్లో సినిమాలేవి రిలీజ్ కాకపోవడం జవాన్‌కు ప్లస్ అయింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక నెట్ లెక్కలు చూసుకుంటే.. రూ.526.73 కోట్లు కలెక్ట్ చేసింది. మరో రూ.17 కోట్లు కలెక్ట్ చేస్తే పఠాన్(రూ.543 కోట్లు)ను క్రాస్ చేసి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టిస్తుంది. ఇప్పుడున్న జోరు చూస్తుంటే ఈ వీకెండ్ పూర్యయ్యేలోపు ఆ రికార్డు కొల్లగొట్టేలానే కనిపిస్తుంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ కట్ వెర్షన్ మరోలా ఉండబోతుందని, అంతేకాకుండా చాలా వరకు సీన్స్‌ను మేకర్స్ యాడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందీ మీడియా టాక్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ లెంగ్త్ 3 గంటలపైమాటే అట. కాగా థియేటర్లో ఈ సినిమా 2గంటల 45 నిమిషాల నిడివితో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా షారుఖ్‌కు ఇచ్చిన ఎలివేషన్లకు నార్త్ ఆడియెన్స్ ఊగిపోతున్నారు.
ఎప్పుడూ లేనిది సౌత్ ఇండియాలో కూడా షారుఖ్ సినిమాకు రీజినల్ భాషల్లో కోట్లుల్లో కలెక్షన్లు వస్తున్నాయి. సినిమా చూసిన ఆడియెన్స్ షారుఖ్ యాక్షన్, అట్లీ డైరెక్షన్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇదే జోరు కొనసాగితే వచ్చే వారంలోపు వెయ్యి కోట్ల మార్క్ అందుకునే చాన్స్ ఉంది. అదే జరిగితే తొలిసారి రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్న తొలి ఇండియన్ హీరోగా షారుఖ్ చరిత్ర సృష్టించిన వాడవుతాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. దీపికా గెస్ట్ అప్పియెరెన్స్ కనిపించింది. విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

