జాతిరత్నాలు (Jathiratnalu) సినిమాతో అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ (Anudeep KV). ఈ దర్శకుడు కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో #SK20 మూవీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర ప్రకటన చేశారు మేకర్స్. ఈ సినిమా కోసం ఉక్రెయిన్ హీరోయిన్ను అనుదీప్ అండ్ టీం ఫైనల్ చేసింది. పలు ఉక్రెనియన్ సినిమాలతోపాటు పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ స్పెషల్ ఒప్స్ లో నటించిన మరియా ర్యాబొశప్క (Maria Ryaboshapka)ను ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఎంపిక చేసినట్టు మేకర్స్ ప్రకటించారు.
భారత్‌లోని పాండిచ్చేరి, యూకేలోని లండన్ బ్యాక్ డ్రాప్లో సాగనున్న ఈ చిత్రంలో కథానుగుణంగా ఫీ మేల్ లీడ్ రోల్‌కు మరియా అయితే పర్ఫెక్ట్గా షూటవుతుందని అనుదీప్ ఫైనల్ చేసినట్టు ఫిలినగర్ సర్కిల్ టాక్. మరియా బబ్లీ అండ్ బ్యూటీఫుల్ లుక్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఫన్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, డి సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ సినిమాలో డైరెక్టర్ రాజమౌళి తొలిసారి ఉక్రెయిన్ భామ ఒలివియా మొర్రీస్ను ఫీ మేల్‌లీడ్ రోల్లో తీసుకున్న విషయం తెలిసిందే. రాజమౌళి సెట్ చేసిన రూట్లోకి ఇపుడు అనుదీప్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.
Team #SK20 Welcomes Actress #MariaRyaboshapka On Board as Female Lead @Siva_Kartikeyan @anudeepfilm @MusicThaman @sureshProdns @SVCLLP @ShanthiTalkies #NarayanDasNarang@SBDaggubati @puskurrammohan @iamarunviswa pic.twitter.com/EC99sf9b7i
— BA Raju's Team (@baraju_SuperHit) March 21, 2022