బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ప్రతి వారం బెస్ట్ పర్ఫార్మర్, వరస్ట్ పర్ఫార్మర్ ఎంపిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ వారం మొత్తం పర్ఫార్మెన్స్ని బట్టి ఎంపిక చేస్తారు. ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకోమని ఆదేశించాడు బిగ్ బాస్ . దీంతో శ్రీరామ్-హమీదా జంట.. లోబోను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొంది.
అనీ మాస్టర్-శ్వేత.. శ్రీరామ్‌ను బెస్ట్, కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్లుగా అభిప్రాయపడ్డారు. విశ్వ-రవి జోడీ.. మానస్‌ను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొంది. షణ్ముఖ్-సిరి.. మానస్ బెస్ట్, లోబో వరస్ట్ అని తేల్చారు. తర్వాత వచ్చిన నటరాజ్ మాస్టర్- లోబో… మానస్‌ను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా తెలిపారు.
కాజల్-జెస్సీ.. మానస్‌ను బెస్ట్, లోబోను వరస్ట్‌గా అభిప్రాయపడ్డారు. ప్రియ- పింకీ.. మానస్‌ను బెస్ట్, లోబో వరస్ట్ అని తెలిపారు. సన్నీ- మానస్.. లోబోను బెస్ట్ అని , జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా తేల్చారు. మొత్తంగా ఈ వారం బెస్ట్ పర్ఫామర్‌గా మానస్‌ను, వరస్ట్ పర్ఫామర్‌గా జెస్సీని ప్రకటించారు.
అయితే ఎక్కువ ఓట్లు వచ్చిన జెస్సీ,లోబోలలో ఎవరిని జైలుకి పంపుతారని కెప్టెన్ అయిన శ్రీరామ్ చంద్రని ప్రశ్నించగా,అందుకు ఆయన హౌజ్‌మేట్స్ సాయం తీసుకున్నాడు. జెస్సీనే పంపాలని కోరడంతో రెండో సారి బాధను దిగమింగుకొని జైలుకి వెళ్లాడు.