‘ఈగ’ తర్వాత నేను తమిళనాడు వెళ్తే, అక్కడ చాలామంది మా తమిళబ్బాయిలాగే ఉన్నావయ్యా’ అన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన కార్తీ కూడా అంతే. ఇక్కడవాళ్లకు అచ్చం తెలుగబ్బాయిలా అనిపిస్తారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న కార్తీ ‘జపాన్’తో షాకింగ్ గెటప్‌తో మనముందుకు వస్తున్నారు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు హీరో నాని. కార్తీ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘జపాన్’. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. రాజు మురుగన్ దర్శకుడు. ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మాతలు. నవంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో కార్తీ మాట్లాడుతూ ..జపాన్’ కథ విన్నప్పుడే కథానుగుణంగా మారాలని ఫిక్సయ్యానని, ఇది తన మనసుకు దగ్గరైన కథ అని, వినోదంతోపాటు ఆలోచింపజేసే సినిమా ఇదని, తన ‘ఖైదీ’చిత్రాన్ని మించేలా ఈ సినిమా ఉంటుదని చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్‌తో పాటు పైడివల్లి వంశీ తదితరులు కూడా పాల్గొన్నారు..