Ram Charan | బర్త్ డే గిఫ్ట్ అంటే ఇది.. రాంచరణ్-ఉపాసనకు జానీ మాస్టర్ కృతజ్ఞతలు
Ram Charan | ఇండస్ట్రీ వ్యక్తులతో సూపర్ బాండింగ్ కొనసాగించే వ్యక్తుల్లో చిరంజీవి, రాంచరణ్ (Ram Charan) గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. తాజాగా పాపులర్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పట్ల ఉన్న తమకున్న గౌరవాన్ని చాటుకొని వార్తల్లో నిలిచారు రాంచరణ్, ఉపాసన దంపతులు.
Ram Charan | టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలకు మెగా ఫ్యామిలీతో మంది అనుబంధం ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ వ్యక్తులతో సూపర్ బాండింగ్ కొనసాగించే వ్యక్తుల్లో చిరంజీవి, రాంచరణ్ (Ram Charan) గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. తాజాగా పాపులర్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పట్ల ఉన్న తమకున్న గౌరవాన్ని చాటుకొని వార్తల్లో నిలిచారు రాంచరణ్, ఉపాసన దంపతులు.
ఇటీవలే తన బర్త్ డే సందర్భంగా జానీ మాస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి నివాసానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తనకు ఇచ్చిన ఆతిథ్యం గురించి జానీ మాస్టర్ ప్రస్తావిస్తూ.. సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు. గ్లోబర్ స్టార్ రాంచరణ్ నుంచి నాకు ఆహ్వానం రావడం.. పుట్టినరోజు నాపై చూపించిన ప్రేమ పట్ల ఉప్పొంగిపోయాను. చిరంజీవి ఆశీర్వాదం, రాంచరణ్-ఉపాసన మాటలు మనస్సుకు హత్తుకున్నాయి. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, రాంచరణ్-ఉపాసన దంపతులు మా డ్యాన్సర్ యూనియన్ టీఎఫ్టీటీడీఏలో 500కు పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా అండగా నిలుస్తామన్నారు.
అడిగిన సహాయాన్ని గుర్తు పెట్టుకొని.. ఇచ్చిన మాటకు విలువనిస్తూ అన్ని కుటుంబాలను చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞతా భావం ఎప్పటికీ ఉంటుందని సోషల్ మీడియా ద్వారా అందరితో సుదీర్ఘ సందేశాన్ని షేర్ చేసుకున్నాడు జానీ మాస్టర్.
సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు 🙏
నా పుట్టినరోజు సందర్భంగా @AlwaysRamCharan అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా.
అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ @KChiruTweets గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న @upasanakonidela వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000… pic.twitter.com/BSgp2oih0G
— Jani Master (@AlwaysJani) July 3, 2024
Read Also :
Coolie | పాపులర్ టెక్నీషియన్‌తో లోకేశ్ కనగరాజ్.. రజినీకాంత్ కూలీ తాజా వార్త ఇదే
Atlee | అంతకు ముందే గెస్ట్ రోల్.. కీర్తిసురేశ్-అట్లీ సినిమాలో సల్మాన్ ఖాన్..!
Kamal Haasan | కమల్ హాసన్ ఇండియన్ 2కు సూపర్ క్రేజ్.. ఐమాక్స్ వెర్షన్ రెడీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

