తన కొత్త సినిమా ‘మిలి’ నటిగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నది బాలీవుడ్ తార జాన్వీకపూర్. మలయాళ హిట్ ఫిల్మ్ ‘హెలెన్’ రీమేక్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు మాతుకుట్టి జేవియర్. సన్నీ కౌశల్, మనోజ్ పావా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్రీజర్ రూమ్‌లో చిక్కుకున్న ఓ యువతి దాని నుంచి ఎలా బయటకొచ్చింది? ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
ఈ సినిమాలో నటించిన అనుభవాలను జాన్వీ వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ…‘నా కెరీర్లో చేసిన ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇదే. దర్శకుడు నాలోని నట ప్రతిభను తెరపై ఆవిష్కరించాడు. మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ చేశాం. ఓ మంచి సినిమా కోసం కష్టపడ్డామనే సంతృప్తి మిగిలింది. ఇలాంటి కథాంశాల్లో నటిస్తూ నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని ఉంది’ అని చెప్పింది. ఈ చిత్రాన్ని జాన్వీ తండ్రి బోనీ కపూర్ నిర్మించారు. వచ్చే నెల 4వ తేదీన విడుదల కానుంది.