ఎన్నాళ్లో వేచిన ఉదయం
బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్‌కు తెలుగు సినీరంగం అంటే ప్రత్యేకమైన అభిమానం. తన దక్షిణాది అరంగేట్రం తెలుగు ఇండస్ట్రీ నుంచే ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పిందీ భామ.
బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్‌కు తెలుగు సినీరంగం అంటే ప్రత్యేకమైన అభిమానం. తన దక్షిణాది అరంగేట్రం తెలుగు ఇండస్ట్రీ నుంచే ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పిందీ భామ. ఆమె కోరుకున్న విధంగానే ఎన్టీఆర్ 30వ చిత్రం ద్వారా జాన్వీకపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ధృవీకరించింది. సోమవారం జాన్వీకపూర్ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘ఆమె తుఫాను వెనక దాగివున్న ప్రశాంతత వంటిది…’ అంటూ ఫొటోకు క్యాప్షన్‌ను జోడించారు. ఫస్ట్‌లుక్‌లో జాన్వీకపూర్ సంప్రదాయ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ నెలలోనే లాంఛనంగా ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉందని, తన కల నిజమైందని జాన్వీకపూర్ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

