Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి తనయిక జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్లామర్ పాత్రలతో పాటు నటన ప్రధాన్యమున్న పాత్రలు చేస్తూ బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఆమె నటించిన ‘మిల్లీ’ రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు చెన్నైలోని ఓ స్టోర్ లాంచ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్లింది. ఈ ఈవెంట్ పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. కాగా ఈ కార్యక్రమంలో జాన్వీని అప్‌కమింగ్ సినిమాల గురించి అడగ్గా.. తాను నటిస్తున్న సినిమాలతో పాటు సౌత్ సినిమాలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
కాగా గతకొన్ని రోజుల నుండి కొరటాలశివ-ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై ఎవరూ స్పందించలేదు. కాగా తాజాగా జాన్వీ త్వరలోనే సౌత్ సినిమాలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ స్టేట్మెంట్తో హీరోయిన్గా ఆల్మోస్ట్ ఆమెనే కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘బావల్’, ‘మిస్టర్ అండ్ మిస్టర్స్ మహీ’ సినిమా చేస్తుంది. వరుణ్ ధావన్‌తో కలిసి చేసిన బావల్ వచ్చే ఏడాది ఏప్రిల్ 9న రిలీజ్ కానుంది.