ప్రతి రోజూ ఓ యుద్ధమే!
‘విజయానికి దగ్గరి దారులు లేవు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని నిరంతరం శ్రమిస్తుంటే తప్పకుండా ఏదో ఒక రోజు మన కలలు సాకారమవుతాయి’ అని చెప్పింది జాన్వీ కపూర్. ఈ భామ నటించిన తాజా చిత్రం ‘మిలీ’ ఈ నెల 4న విడుదలకానుంది.
‘విజయానికి దగ్గరి దారులు లేవు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని నిరంతరం శ్రమిస్తుంటే తప్పకుండా ఏదో ఒక రోజు మన కలలు సాకారమవుతాయి’ అని చెప్పింది జాన్వీ కపూర్. ఈ భామ నటించిన తాజా చిత్రం ‘మిలీ’ ఈ నెల 4న విడుదలకానుంది. మలయాళ చిత్రం ‘హెలెన్’కు రీమేక్ ఇది. ఈ సందర్భంగా మాట్లాడిన జాన్వీకపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ఘనమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల నిత్యం విమర్శలు చేస్తుంటారని, వాటి వల్ల మానసికంగా డిస్టర్బ్ అవుతున్నానని చెప్పింది.
‘మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టే అవకాశాలొస్తున్నాయనే మాటలు విన్నప్పుడల్లా కొంచెం బాధగా అనిపిస్తుంది. సినీ నేపథ్యం రెండుమూడు అవకాశాల వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత స్వయంప్రతిభతో రాణించాల్సిందే. విమర్శకులకు సమాధానం చెప్పాలనే కసితో కష్టపడి పనిచేస్తుంటా. నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రతి రోజూ ఓ యుద్ధమే చేస్తున్నా’ అని చెప్పింది జాన్వీకపూర్.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

