Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీకపూర్.. లవ్ టుడే హీరోతో రొమాన్స్!
Janhvi Kapoor | ఐదేళ్ల సినీ కెరీర్లో వినూత్న కథా చిత్రాల్లో భాగమై బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది జాన్వీకపూర్. ‘దేవర’ చిత్రంతో ఈ భామ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజా మాచారం ప్రకారం ఈ సొగసరి తమిళ అరంగేట్రానికి కూడా రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
Janhvi Kapoor | ఐదేళ్ల సినీ కెరీర్లో వినూత్న కథా చిత్రాల్లో భాగమై బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది జాన్వీకపూర్. ‘దేవర’ చిత్రంతో ఈ భామ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సొగసరి తమిళ అరంగేట్రానికి కూడా రంగం సిద్ధమైనట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే… ‘లవ్ టుడే’ చిత్రంతో తమిళనాట మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్.
ప్రస్తుతం ఆయన విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ కథాంశమిది. మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి టైమ్ ట్రావెల్ చేసిన ఓ యువకుడు తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేది చిత్ర కథాంశమని సమాచారం. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం జాన్వీకపూర్‌ను సంప్రదించారని, వినూత్నమైన కాన్సెప్ట్ కావడంతో ఆమె ఈ సినిమాకు అంగీకరించిందని చెబుతున్నారు. ‘విక్కీ-6’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రముఖ నటుడు కమల్‌హాసన్ నిర్మించబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

