న్యూఢిల్లీ: బాలీవుడ్ క్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor).. బ్లూ లెహంగాలో మెరిసిపోయింది. ఢిల్లీలో జరిగిన ఇండియా కౌటర్ వీక్ షోలో ఆమె ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నది. అంతర్జాతీయ మేటి డిజైనర్ గౌరవ్ గుప్తా .. జాన్వీ లెహంగాను డిజైన్ చేశాడు. బ్లూ కలర్ డ్రెస్సులో జాన్వీ ఫుల్ జోష్‌లో కనిపించింది. చాలా స్టయిలిష్‌గా ఆమె క్యాట్‌వాక్ చేసింది. హోయలు వొలికే లుక్స్‌తో .. షోలో అందర్నీ స్టన్ చేసింది.
బ్లూ కలర్ లెహంగాలో జాన్వీ చాలా గ్లామరస్‌గా కనిపించింది. డిజైనర్ గౌరవ్ గుప్తా కూడా క్యాట్వాక్లో పాల్గొన్నాడు. కొత్త లుక్ కోసం జాన్వీ పెద్దగా మేకప్ వేసుకోలేదు. వెట్ హెయిర్‌స్టయిల్‌తో ఆమె షోలో పాల్గొన్నది. ప్రస్తుతం ఆ ఈవెంట్‌కు చెందిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వరుణ్ ధావన్‌తో నటించిన బవాల్ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఆ సినిమాలో నటించిన ఈ జంటపై ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఆమె ఉలజ్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. ఆ సినిమా త్వరలో రిలీజ్‌కానున్నది.