Janhvi Kapoor | ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ద్వారా జాన్వీకపూర్ తెలుగులో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. తన తల్లి, దివంగత అందాల తార శ్రీదేవి మాదిరిగానే తనకు తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రత్యేకమైన అభిమానమని, దక్షిణాదిలో తన తొలి ప్రాధాన్యత తెలుగు భాషకేనని పలు సందర్భాల్లో చెప్పింది జాన్వీకపూర్.
తాజాగా ఈ భామ తెలుగులో మరో బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్య స్పోర్ట్స్ డ్రామా కథాంశమిది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతున్నది.
ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీకపూర్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో జాన్వీకపూర్ రామ్‌చరణ్ షూటింగ్లో జాయిన్ అవుతుందని, తెలుగులో తన కుమార్తెకు మరో మంచి అవకాశమిదని బోనీకపూర్ ఆనందం వ్యక్తం చేశారు.